అయోధ్య రాముడిలో ఆ హీరో పోలికలు.. ఆనందంలో ఫ్యాన్స్?

by Jakkula Samataha |
అయోధ్య రాముడిలో ఆ హీరో పోలికలు.. ఆనందంలో ఫ్యాన్స్?
X

దిశ, సినిమా : అయోధ్యలో విగ్రహప్రాణప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. కొట్లాది మంది భక్తుల మధ్య బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా నెట్టింట్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే? హీరోలకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ఇక తమకు నచ్చిన హీరోను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా, సోషల్ మీడియా వేధికగా వారికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్‌ను, లేటేస్ట్ న్యూస్‌ను ప్రమోట్ చేస్తారు. అయితే ఓ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియలో తెగ హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే? అయోధ్యలో కొలువుదీరిన శ్రీరాముడు అచ్చం మా హీరోలా ఉన్నాడంటూ సంబరపడుతూ తెగ పోస్టులు చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్లితే.. దివంగత నటుడు విజయ్ కాంత్ ఫ్యాన్స్ సరికొత్త న్యూస్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. అయోధ్యలోని రాముడు విగ్రహంలో విజయ్ కాంత్ పోలికలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు .దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై కొందరు స్పందిస్తూ.. ఎవరి ఆనందం వారిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story