Prince Mahesh Babu: సూపర్ స్టార్‌నే బీట్ చేసిన లేడీ సింగర్.. ఏకంగా 3000 మందికి.. షాక్‌లో ఫ్యాన్స్

by Anjali |
Prince Mahesh Babu: సూపర్ స్టార్‌నే బీట్ చేసిన లేడీ సింగర్.. ఏకంగా 3000 మందికి.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువే. తండ్రి కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటన, డాన్స్‌లో దూసుకుపోతున్నారు. ఇకపోతే ప్రిన్స్ కేవలం రీల్ హీరోనే కాకుండా రియల్ హీరోగా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో చాలా మంది అటు లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే ఇటు ఆపదలో ఉన్న జనాలకు కూడా ఆదుకుంటారు. ఈ విషయం గురించి మాట్లాడితే.. ముందుగా మనకు హీరో సోనూసూదే గుర్తొస్తారు. కరోనా సమయంలో ఎంతోమంది ఈ హీరో సహాయం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తను సంపాదించిన డబ్బులో ఎంతో కొంత సమాజ సేవ కోసం ఖర్చు చేస్తుంటారు. ప్రిన్స్ ఇప్పటికి 1200 మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన విషయం తెలిసిందే. అయితే మనకు ఇప్పటివరకు కేవలం సూపర్ స్టార్ మాత్రమే గొప్ప మనసు చాటుకున్నారని తెలుసు. కానీ మనకు తెలియని మరో వ్యక్తి మహేష్ బాబు కంటే మూడు రెట్లు ఎక్కువగానే చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించిందట. మరీ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్.

అనేక సినిమాల్లో పాటలు పాడి.. తన గానంలో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. ఈమె సింగర్‌తో పాటు డాక్టర్ కూడా. ఇప్పటివరకు ఏకంగా 3000మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించిందట. ముచ్చల్ మూవీల్లో సాంగ్స్ పాడటానికి కారణం కూడా పిల్లలే కారణమని ఇటీవల చెప్పుకొచ్చింది. తను ఒక్క పాట పాడితే ఆ డబ్బుతో 14 మంది పిల్లల ఆపరేషన్స్‌కు సరిపోతుందట. ఇంకా ముచ్చల్ 400 మంది పిల్లలకు ఆపరేషన్ చేయాల్సి ఉందట.ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ముచ్చల్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed