మెగా హీరోపై లేడీ ఫ్యాన్ అలాంటి పోస్ట్.. స్పందించిన సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే?

by Disha Web Desk 6 |
మెగా హీరోపై లేడీ ఫ్యాన్ అలాంటి పోస్ట్.. స్పందించిన సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడంటే?
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్స్ తమకు రిప్లై ఇవ్వాలని నెట్టింట కొందరు రీల్స్, పోస్టులు చేస్తూ ట్రెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది ఇలా చేయడంలో స్టార్ హీరోలు సైతం కొందరు స్పందించారు. తాజాగా, ఓ లేడి ఫ్యాన్ తన కోరికను బయటపెట్టి షాక్‌కు గురిచేసింది.

తన పుట్టినరోజు కావడంతో .. సాయి ధరమ్ తేజ్ తనకు బర్త్ డే విషెస్ చెబితే అదే గొప్ప.. అదే నాకు ప్రపంచంతో సమానం. అతను నన్ను విష్ చేస్తాడని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చింది. అంతేకాకుండా మెగా హీరోను ట్యాగ్ చేసింది. దీంతో వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దయచేసి బాగా చదువుకొని నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయి అని పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మెగా హీరో ప్రపంచం అని షాకిచ్చి విషెస్ చెప్పించుకుందని అంటున్నారు.



Next Story

Most Viewed