బ్యాంకుకు వెళ్ళినప్పుడు చెక్కు వెనకాల సంతకం పెడుతున్నారా..అది ఎందుకో తెలుసుకోండి?

by Disha Web Desk 18 |
బ్యాంకుకు వెళ్ళినప్పుడు చెక్కు వెనకాల సంతకం పెడుతున్నారా..అది ఎందుకో తెలుసుకోండి?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రజెంట్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో చూస్తూనే ఉన్నం. ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంటేనే ఏ వస్తువు అయినా కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం డబ్బు లావాదేవీలకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అవి ATM, నెట్ బ్యాంకింగ్, UPI బ్యాంక్ ద్వారా లావాదేవీలు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.. ఈ క్రమంలో మీరు చెక్కు ద్వారా చెల్లించేటప్పుడు బ్యాంకు అధికారి చెక్కు వెనుక సంతకం చేయమని అడుగుతారు. చెక్కు ముందు భాగంలో జారీ చేసిన వారి సంతకం చేసినప్పటికీ ఈ సంతకాన్ని చెక్కు వెనుక ఎందుకు చేయమంటారో చాలా మందికి తెలియదు. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళితే..ఆర్డర్ చెక్‌లో పేరు ఉన్న వ్యక్తికి మాత్రమే చెల్లింపు చేయబడుతుంది. ఆ వ్యక్తి ఆ సమయానికి బ్యాంకులో ఉండాలి. అందువల్ల ఆర్డర్ చెక్కు పై సంతకం అవసరం లేదు. ఆర్డర్ చెక్‌ను క్యాష్ చేయడానికి ముందు, బ్యాంక్ ఉద్యోగులు చెక్కులో పేర్కొన్న వ్యక్తి బేరర్ కాదా అవునా అని పరిశీలించి ఆపై డబ్బును ఇస్తారు. ఒకవేళ చెక్‌ను పోగొట్టుకున్న, దొంగిలించిన బేరర్ చెక్కును బ్యాంక్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, బ్యాంకుతో ప్రశ్నలు తలెత్తవచ్చు.

ఈ క్రమంలో డబ్బు తప్పు వ్యక్తికి వెళితే బ్యాంక్ బాధ్యత వహించదు అనే ఆధారంగా చెక్కు వెనుక సంతకం చేయమని అడుగుతారు. కానీ, 50,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటే, డబ్బును విత్‌డ్రా చేయడానికి వచ్చే వ్యక్తి నుంచి బ్యాంకు తప్పనిసరిగా చిరునామా ధ్రువీకరణ పత్రాన్ని అడిగిన తర్వాత మాత్రమే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సంతకం చేయడానికి నిరాకరిస్తే, డబ్బును స్వీకరించడానికి దరఖాస్తును జత చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ చెక్ వెనుక సంతకం అవసరం లేదు. అయితే వీటిలో కూడా అన్ని చెక్కుల వెనుక సంతకం చేయరు.

Next Story