BREAKING: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీలు.. రూ.3.16 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

by Shiva |
BREAKING: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల తనిఖీలు.. రూ.3.16 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.16 కోట్ల విలువ చేసే బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బాచుపల్లిలో రెండు బైకుల మీద తరలిస్తున్న రూ.22 లక్షల నగదు పోలీసులు గుర్తించారు. డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో క్యాష్ సీజ్ చేశారు. ఇక మేడ్చల్‌లో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏటీఎంలకు నగదును తరలిస్తున్న వాహనంలో రూ.24.91 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కూకట్‌పల్లి సౌతిండియా షాపింగ్ మాల్ వద్ద కారులో రూ.2.63 లక్షలు తరలిస్తుండగా పోలీసులు నగదును సీజ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed