ముస్లిం మైనార్టీలను పట్టించుకున్నది బీఆర్ఎస్సే : కేటీఆర్

by Disha Web Desk 23 |
ముస్లిం మైనార్టీలను పట్టించుకున్నది బీఆర్ఎస్సే :  కేటీఆర్
X

దిశ,మల్కాజిగిరి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని బంజారా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ముస్లిం మైనార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాన్ లోకల్ అని, లోకల్ గా ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని బలపర్చాలని కోరారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే అది కచ్చితంగా బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, రైతుల ఆదాయం డబుల్ అవుతుందనీ, ప్రతి ఒక్కరికి ఇళ్లు, ప్రతి ఇంటికో నల్లా అని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారేంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు.

బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, కరెంట్ కష్టాలు ఉన్నాయా..? ఒక్కసారి ఆలోచించాలంచాలని కోరారు. కేసీఆర్ పాలనలో మత సామరస్యాన్ని కాపాడారని, మతం పేరుతో రాజకీయాలు చేయలేదన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన, ముస్లింలు పేదరికంలోనే ఉన్నారన్నారు. మైనార్టీలు, పేదల సంక్షేమానికి నిజాయితీగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పని చేసిందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ , కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి , సబితా అనిల్ కిషోర్ గౌడ్ ,మేకల సునీత రాము యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్ధం పరుశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, అమీనుద్దిన్, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, ఇబ్రహీం, ఉస్మాన్, ఖలీల్ భాయ్, ఉపేందర్ రెడ్డి, ఢిల్లీ పరమేష్, లక్ష్మణ్ యాదవ్,వెంకటేష్ యాదవ్, మోసిన్, ఆతిక్ పాష,ఆరీఫ్ ,రెహమత్, చాంద్ పాషా, జావేద్, డైమండ్ షేక్, ముస్లిం సోదరులు మహిళలు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story