- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకప్పుడు స్టార్ సింగర్ ఇంట్లో వంట మనిషే.. నేడు సీఎం గుర్తించిన సోషల్ మీడియా సెన్సేషన్
దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కుమారీ ఆంటీ పేరు మారుమోగుతోంది. గుడివాడ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ మధ్యాహ్నం భోజనం అమ్ముకునే ఒక మహిళనే కుమారీ ఆంటీ. సోషల్ మీడియాలో ఈ ఆంటీ ఫుడ్ స్టాల్ వీడియోలు వైరల్ కావడంతో జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆమె ఫుడ్ సెంటర్ వద్దకు జనాలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రీసెంట్‌గా అధికారులు.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని.. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను తొలగించాలని హెచ్చరించారు. దీంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ను తొలగించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. అలాగే వీలున్నప్పుడు వెళ్లి ఆమె దగ్గర భోజనం కూడా చేస్తానని చెప్పారు. దీంతో జనాలు సీఎం పై పొగడ్తల వర్షం కురిపించారు.
కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాక.. పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆమెను అప్రోచ్ అయి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అయితే కుమారి ఆంటీ ఈ బిజినెస్ లోకి రాకముందు ఈమె టాలీవుడ్ సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేసేదట. ఇక పిల్లలు పెరిగేకొద్ది ఖర్చులు ఎక్కువ కావడంతో హైదరాబాదును వీడి సొంత ఊరుకు వెళ్లిందట.
లాక్ డౌన్ ముందు గుడివాడ వెళ్లిన ఈమె ఏం చేయాలో అర్థం కాక కొద్దిపాటి భూమిలో కూరగాయలు పండించి అమ్మడం మొదలుపెట్టిందట. లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ సిటీకి వచ్చి ఈ బిజినెస్ ప్రారంభించినట్లు కుమారీ ఆంటీ వెల్లడించింది. ఒక సింగర్ ఇంట్లో వంట మనిషిగా చేసిన కుమారి ఆంటీ ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి గుర్తించిన ఒక సోషల్ మీడియా సెన్సేషన్ కావడం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
Read More: కుమారి ఆంటీ స్టోరీతో అదిరిపోయే డాక్యుమెంటరీ రిలీజ్ చేయనున్న నెట్‌ఫ్లిక్స్.. పోస్టర్స్ వైరల్!