- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజు సల్మాన్ వచ్చేదాకా ఆకలితో అల్లాడిపోయాం: 'రెడీ' షూటింగ్‌పై కుబ్రా
దిశ, సినిమా: బాలీవుడ్ నటి కుబ్రా సైత్ సల్మాన్ ఖాన్ పనితీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 2011లో వచ్చిన తన తొలి చిత్రం 'రెడీ' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు రీసెంట్‌గా ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన నటి..'రెడీ' షూటింగ్ సమయంలో సరైన ఆహారం దొరక్క కష్టపడాల్సి వచ్చింది. ఏవైనా స్నాక్స్ కావాలని అడిగితే నా ముఖం మీద ఒక ఆపిల్ విసిరారు. నేను మరొకటి కావాలని అడుక్కోవాల్సి వచ్చింది. నాతోపాటు ఆకలితో అలమటిస్తున్న సిబ్బంది మొత్తం సల్మాన్ కోసం ఎదురుచూస్తున్నాం. ఆయనొస్తే షూట్ కంప్లీట్ అవగానే బోభనానికి వెళ్లొచ్చని. కానీ, పది గంటలకు రావాల్సిన సల్మాన్ మధ్యాహ్నం 2.45 గంటలకు వచ్చాడు. రాగానే 'లంచ్ బ్రేక్ కరే?' అన్నాడు. దీంతో పరుగెత్తుకెళ్లి తినేశాం. సెట్‌లో ప్రతి ఒక్కరికి అన్నీ సమకూరేలా ఆయన దగ్గరుండి చూసుకున్నాడు. ఆ సమయంలో ఆకలితో ఉన్నప్పటికీ బాగా నవ్వొచ్చింది. ఇప్పటికీ ఆ సందర్భం గుర్తొస్తే నవ్వకుండా ఉండలేను' అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.