అన్‌స్టాపబుల్‌కు KTR, Ramcharan ..!!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-06 04:04:25.0  )
అన్‌స్టాపబుల్‌కు KTR, Ramcharan ..!!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆహా ఓటీటీ వేదికగా ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోకి వస్తున్న రెస్పాన్స్ మరే షోకు దక్కలేదు. అందులోను అన్ స్టాపబుల్ సీజన్ 2 అంచనాలకు మించి సాగుతోంది. బాలయ్య హోస్ట్‌గా ఉండటంతో, గెస్టుల ఖరారు నుంచే ఆసక్తి కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు - నారా లోకేశ్‌తో ప్రారంభించిన ఈ రెండో సీజన్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. అందుకే సినీ ప్రముఖుల నుండి రాజకీయ ప్రముఖుల వరకు ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అన్‌స్టాపబుల్‌ మరో సంచలనం సృష్టించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బాలయ్య - పవన్ కల్యాణ్ కాంబోతో సిద్దమవుతున్న ఎపిసోడ్ పైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఎపిసోడ్ షూటింగ్ సమయంలో బాలయ్య ప్రశ్నలు.. పవన్ సమాధానాలపైన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ షో కోసం అటు అభిమానులు, ఇటు రాజకీయ నాయకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే, పవన్ ఎపిసోడ్ కోసం నిరీక్షిస్తున్న సమయంలోనే మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సారి పొలిటికల్ అండ్ మూవీ హీరోల కాంబోతో నిర్వాహకులు కొత్త ఎపిసోడ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, హీరో రాంచరణ్ ఇద్దరితో కలిపి షోకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా, పొలిటికల్ సెలబ్రెటీలతో షో నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ నిర్వాహకులు.. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసారు. సంక్రాంతిలోగా ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. రాంచరణ్‌ ఇప్పటికే ఓకే చెప్పగా మంత్రి కేటీఆర్ డేట్‌‌ను కేటాయించాల్సి ఉంది. ఆ తేదీలో షూటింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ - మెగా ఫ్యామిలీ మధ్య మంచి రిలేషన్ ఉందనే విషయం అందరికి తెలిసిందే. సినీ హీరోలు - మంత్రి కేటీఆర్ మధ్య సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించి సినీ ఈవెంట్స్‌కు కేటీఆర్ పలు సందర్భాల్లో హాజరయ్యారు. అదే విధంగా మంత్రి కేటీఆర్, హీరో రాంచరణ్ మధ్య ఉన్న దోస్తీని హైలైట్ చేస్తూ ఈ ఎపిసోడ్‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాంచరణ్ తాజాగా ప్రభాస్ ఎపిసోడ్‌లో ఫోన్ ద్వారా సందడి చేసిన సీన్స్ అందరం చూసాం.

అందులో రాంచరణ్‌తో మాట్లాడిన బాలయ్య.. షోకు ఎప్పుడు వస్తావు అని అడగ్గానే, ఒక్క పిలుపు దూరం అంటూ రాంచరణ్ సమాధానం ఇచ్చాడు. దీంతో, రాంచరణ్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను షోకు ఇన్వైట్ చేసేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తునే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రీల్‌కమ్ రియల్‌హీరో కాంబినేషన్ అందులోను బాలయ్య హోస్టింగ్‌తో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, త్వరలో ప్రసారం కానున్న పవన్‌కల్యాణ్ ఎపిసోడ్‌లో ఇప్పటి వరకు జనసేనాని వ్యక్తిగత జీవితంపైన వస్తున్న ఆరోపణలకు పూర్తిస్థాయి సమాధానంతో ఇక ఎవరూ ఆ అంశాలు ఎత్తకుండా సమాధానం ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు కేటీఆర్, రాంచరణ్ కాంబోలో బాలయ్య నిర్వహించే షో గురించి సినీ, పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా అధికారిక ప్రకటన కోసం ఇరువురి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Also Read...

జాన్‌బాజ్ హిందుస్తాన్ కే: Regina కొత్త వెబ్ సిరీస్‌కి టైటిల్‌ ఫిక్స్!

Advertisement

Next Story