హీరోయిన్స్‌ను అందుకే పెళ్లి చేసుకోరు.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్!

by samatah |
హీరోయిన్స్‌ను అందుకే పెళ్లి చేసుకోరు.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ బ్యూటీ కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌పై రూమర్స్ రావడం చాలా సహజం. కానీ కొంత మంది డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతారు. దీంతో చిత్ర పరిశ్రమలో పని చేసే హీరోయిన్ అంటే ఎవరికీ ఎక్కువ మర్యాద ఉండదు.

సినిమాల్లోకి వెళ్తే చెడిపోతారు, హీరోయిన్‌గా చేయడం అంటే జీవితం నాశనం చేసుకున్నట్లే అనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ క్రమంలో ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో నటిస్తున్న కృతిసనన్.. ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ..ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఎవరికీ ఎక్కువగా నచ్చదు. హీరోయిన్ అంటేనే ఏదో తప్పుమనిషి అన్నట్లు చూస్తుంటారు. అందుకే హీరోయిన్స్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. అందువల్లనే ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లీలు చాలే లేటుగా జరుగుతాయి.నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే సమయంలో నాకు చాలా మంది ఇవే మాటలు చెప్పారు కానీ, నేను అవి ఏవి పట్టించుకోలేందంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story