నిర్మాతగా మారిన Kriti Sanon.. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ బ్యానర్‌ ప్రారంభం

by samatah |   ( Updated:2023-07-08 12:58:36.0  )
నిర్మాతగా మారిన Kriti Sanon.. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ బ్యానర్‌ ప్రారంభం
X

దిశ, సినిమా: స్టార్ నటి కృతిసనన్ నిర్మాతగా మారబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్’ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు ప్రకటించిన నటి.. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘గత 9 ఏళ్లుగా నా కలలను నిజం చేసుకుంటూ పరిశ్రమలో ఉన్నాను. నేను బేబీ స్టెప్స్ వేశాను. ఎంతో నేర్చుకున్నాను, పరిణామం చెందాను. నటిగా ఎదిగిన నేనూ.. ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి బిట్‌ను చాలా ఇష్టపడతాను. ఇప్పుడు హృదయాన్ని తాకే మరిన్ని కథలను చెప్పడానికి, మరింత చేయడానికి, మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది. నిరంతరం అభివృద్ధి చెందడం, అత్యంత అందమైన సంస్కరణలను కనుగొనడంకోసం దీన్ని ప్రారంభించడాన్ని సంతోషిస్తున్నా. మోస్ట్ బ్యూటీఫుల్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story