Kriti Sanon: అలా అందరి ముందు నడవడానికి భయమేసి ఏడ్చేశాను.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్

by sudharani |
Kriti Sanon: అలా అందరి ముందు నడవడానికి భయమేసి ఏడ్చేశాను.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ‘వన్ నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ ఫస్ట్ సినిమా అనుకున్నంత ఫలితం దక్కించుకోకపోవడంతో.. ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. తర్వాత ‘దోచెయ్’, ‘ఆదిపురుష్’ మూవీస్ చేసింది. అవి కూడా డిజాస్టర్ కావడంతో.. బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే త్వరలో ‘దో పత్తీ’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్.. తన మోడలింగ్ సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి గుర్తి చేసుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నాకు మోడలింగ్‌పై ఇంట్రెస్ట్ కలిగింది. ఇక మోడలింగ్‌లో అడుగు పెట్టిన కొన్ని రోజులకే టీవీ యాడ్స్ చేశా. అయితే యాడ్స్ చేసినప్పుడు దానికి సంబంధించిన దర్శకులు నాకు నటనలో సహజమైన ప్రతిభ ఉందని, సినీ ఫీల్డ్ వైపు వెళ్లమని ప్రోత్సహించారు. దాంతో చిత్రపరిశ్రమలోకి అడుగులు వేశా. నేను మొదటిసారి ర్యాంప్ వాక్ చేసిన రోజు నాకింక గుర్తుంది. ఢిల్లిలో జరిగిన ఆ షోలో ఎత్తైన చెప్పులు వేసుకుని నడవాలి. అలా అప్పుడు అందరి ముందు నడవడానికి చాలా భయం వేసింది. ఏడ్చేశాను కూడా. ఆ సంఘన ఇంకా మర్చిపోలేను. కానీ ఆరోజులు నాకు చాలా పాఠాలు నేర్పాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story