నా కొడుకుకు ఆ హీరో పోలికలు కావాలంటున్న నటి..

by Disha News Web Desk |
నా కొడుకుకు ఆ హీరో పోలికలు కావాలంటున్న నటి..
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్‌ రోషన్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. వీరిలో హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ క్రిస్టెన్‌ స్టీవర్ట్‌ కూడా ఒకరు కాగా.. 'ట్విలైట్ బ్రేకింగ్ డాన్ పార్ట్2' సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న భామ ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'హృతిక్ రోషన్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటారు కదా. ఆయనతో సినిమా చేస్తారా?' అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. 'మంచి స్క్రిప్ట్‌ దొరికితే బాలీవుడ్‌‌లో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా హృతిక్‌తో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నా. ఆయన అద్భుతమైన నటుడు. చాలా అందంగా ఉంటాడు. నాకు కొడుకు ఉంటే.. టాలెంట్, ఫిట్‌నెస్ కలిగిన హృతిక్‌ మాదిరిగా ఉండాలని కోరుకుంటాను' అని తెలిపింది.

https://www.instagram.com/p/CSuRs9Wh1wH/?utm_source=ig_web_copy_link


Advertisement

Next Story