అశ్వనీదత్‌పై పోసాని కృష్ణమురళి ఫైర్

by Shiva |   ( Updated:2023-05-02 05:18:38.0  )
అశ్వనీదత్‌పై పోసాని కృష్ణమురళి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వైజయంతి అర్ట్స్ అధినేత అశ్వనీదత్‌పై ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సోమవారం ఫైర్ అయ్యారు. నంది అవార్డులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ తాజాగా అశ్వనీదత్ కామెంట్ చేశారు. ఏపీలో ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి ఉత్తమ లోఫర్, మోసగాడు, వెన్నుపోటుదారుడు వంటి అవార్డులు మీ వాళ్లకే వస్తాయని పోసాని కౌంటర్ ఇచ్చారు.

Read more:

సూపర్ స్టార్ రజినీకాంత్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story