Krishna Mukunda Murari ఆగస్ట్ 28: ఈ రోజు ఎపిసోడ్ లో కృష్ణ అంటే చాలా ఇష్టమని రేవతికి చెప్పిన మురారి

by Prasanna |   ( Updated:2024-02-03 13:25:01.0  )
Krishna Mukunda Murari ఆగస్ట్ 28:  ఈ రోజు ఎపిసోడ్ లో కృష్ణ అంటే చాలా ఇష్టమని రేవతికి చెప్పిన మురారి
X

దిశ,వెబ్ డెస్క్: కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

కృష్ణ, మురారి విడిపోవడం రేవతి తట్టుకోలేకపోతుంది. క్యాంప్‌లో ఉన్న మురారిని చూడటానికి వస్తుంది. మురారికి కృష్ణ చేస్తోన్న సేవలు చూసి వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉంది.. కానీ ఇద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారని రేవతి మురారిని అడుగుతుంది. రేవతి సీరియస్ కావడంతో అసలు ఏమైంది, ఎందుకు ఇలా మారిపోయావని అడగగా.. మురారి ఎమోషనల్ అవుతాడు. మేమిద్దరం, బాగుండాలని ఎన్నో పూజలు చేసావు.. హోమాలు చేశావు. మీరు బాగుండాలని, ఎప్పటికీ కలిసి ఉండాలని, మీతో బలవంతంగా చేయించిన పూజలు వ్రతాల గురించే తెలుసు. కానీ మీరు ఎప్పటికీ విడిపోకూడదని మీకు తెలియకుండా ఇంకా ఎన్ని పూజలు చేశానో, ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నానో మీకు తెలియదు. అయినా ఇద్దరు విడిపోయి ఎవరు బతుకు వాళ్లు బతకడమే కదా మీకు కావాల్సింది. ఇప్పుడు అదే జరుగుతుంది అంటూ రేవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed