Devara -2: ‘ఈ విషయంలో ప్రామిస్ చేస్తాను’.. దేవర-2 పై భారీ హైప్ పెంచేసిన కొరటాల..!!

by Anjali |   ( Updated:2024-10-08 15:05:16.0  )
Devara -2: ‘ఈ విషయంలో ప్రామిస్ చేస్తాను’.. దేవర-2 పై భారీ హైప్ పెంచేసిన కొరటాల..!!
X

దిశ, వెబ్‌డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో జనాలు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. అలాగే భారీ వసూళ్లు కొల్లగొట్టిన సినిమాలో దేవర ఒకటిగా నిలిచింది. అదిరిపోయే సన్నివేశాలతో కొరటాల ప్రేక్షకులకు ఫుల్ జోష్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా తెలుగులో నటించినప్పటికీ జాన్వీ కపూర్‌కు కూడా ప్రేక్షకుల మద్దతు లభిస్తుంది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పార్ట్ -2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేవర రెండో భాగంలో హీరోయిన్ జాన్వీ పాత్ర ఎక్కువగా ఉంటుంది.. పవర్ ఫుల్ గా ఉంటుందని..ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని అన్నారు. మొదటి భాగంలో మీరు చూసింది కేవలం పది శాతమేనని తెలిపారు. అసలు ట్విస్ట్ లు, మరింత ఉత్సాహాన్ని మూవీని దేవర-2 లో చూస్తారని, కొన్ని సన్నివేశాలైతే థియేటర్ల నుంచి బయటికెళ్లినా అస్సలు మర్చిపోలేరని, ఈ విషయంలో అయితే నేను ప్రామిస్ చేస్తున్నానని ప్రేక్షకులకు గట్టి నమ్మకం ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదని, పాత్రకు ప్రాణం పోస్తాడని దర్శకుడు ఫ్యాన్స్‌కు ఫుల్ క్యూరియాసిటీని పెంచేశారు. దేవర రెండో భాగంపై కొరటాల ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story