కీర్తి సురేష్‌తో పెళ్లి రూమర్స్.. రాత్రికి రాత్రే ఆమెను పెళ్లి చేసుకొని సడెన్ షాకిచ్చిన కమెడియన్!

by Jakkula Samataha |   ( Updated:2024-06-09 07:56:05.0  )
కీర్తి సురేష్‌తో పెళ్లి రూమర్స్.. రాత్రికి రాత్రే ఆమెను పెళ్లి చేసుకొని సడెన్ షాకిచ్చిన కమెడియన్!
X

దిశ, సినిమా : కోలివుడ్ కమెడియన్, మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్‌గీపెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్‌లో పెళ్లికొడుకుగా రెడీ అయి ఉన్న ఫోటోతో దర్శనం ఇచ్చారు. దీంతో అందరూ ఆయన నిశ్చితార్థం చేసుకొని ఉంటారని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన తన కుంటుంబ సభ్యుల సమక్షంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం ప్రేమ్ గీకి 45 సంవత్సరాలు. ఇన్ని రోజులు ఆయన ఒంటరిగానే ఉన్నారు. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి ఈయన పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ 45 ఏళ్ల కమెడియన్ ప్రేమ్‌గీని పెళ్లి చేసుకోబోతుంది. త్వరలో నిశ్చితార్థం అంటూ ఈ మధ్య ఓరూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి చేసుకోవడం అందరికీ షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఈయన ఇందు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలకు యువ హీరోలు జై, వైభవ్, తదితరుల హాజరు అయ్యారు. అయితే ఈ మ్యారేజ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం తెలియదు. ప్రముఖ తమిళ దర్శకుడు ప్రేమ్ గీ సోదరుడు వెంకట్ ప్రభు, వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Advertisement

Next Story

Most Viewed