కొడాలి నాని ఒడిలో కాళ్లు పెట్టి కూర్చొన్న Jnr ఎన్టీఆర్.. షాక్‌లో ఫ్యాన్స్!

by Disha Web Desk 8 |
కొడాలి నాని ఒడిలో కాళ్లు పెట్టి కూర్చొన్న  Jnr ఎన్టీఆర్.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఏపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ ఎంత క్లోజ్‌గా ఉండేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ఇద్దరు కలిసి, మెలిసి ఉండేవారు. అప్పుడప్పుడు తారక్ సినిమా సెట్స్ కూడా కొడాలి నాని వెళ్లేవారంట. అంతే కాకుండా ఆయన ఎన్టీఆర్‌కు సినిమాల విషయంలో చాలా సలహాలు ఇచ్చేవారని, కొన్ని సినిమాలు కూడా ఆయన నిర్మించినట్లు సమాచారం.

అయితే తాజాగా అప్పటి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో కొడాలి నాని కుర్చిలో కూర్చొని సీరియస్‌గా పుస్తకం వైపు చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నవ్వుతూ.. కొడాలి నాని ఒళ్లో కాళ్లు పెట్టి, కాలిపై కాలు వేసు కూర్చున్నాడు. మరో పక్క వల్లభనేని వంశీ కూడా నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతుండటంతో ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీరు ముగ్గురు అంత క్లోజ్‌గా ఉండేవారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్‌లో మూవీ విడుదల కానున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed