రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరికలను నెరవేర్చనివ్వరు: హర్యానా సీఎం

by Disha Web Desk 17 |
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరికలను నెరవేర్చనివ్వరు: హర్యానా సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో సీఎం నయాబ్‌ సైనీ తాజాగా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఆ పార్టీ చరిత్ర దేశం మొత్తానికి తెలుసు, అసలు లోక్‌సభలో మెజారిటీ లేక రాష్ట్రంలో ప్రజల కోరికలు నెరవేరుస్తామని చెబుతుంది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోరికలను నెరవేర్చనివ్వరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీని వీడటంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేవు. అయితే కాంగ్రెస్‌కు మాత్రం ఇబ్బందులు ఉండొచ్చు అని అన్నారు.

రాహుల్ అబద్ధాల పరంపర ఇప్పుడు పనిచేయదు, ప్రధాని మోడీ హామీలు మాత్రమే పని చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనపడుతుంది. 2014 తో పోలిస్తే 2019లో కాంగ్రెస్ తక్కువ స్థానాల్లో పోటీ చేయగా 2024లో కూడా తక్కువ స్థానాల్లో పోటీ చేయడం చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది.. ఈరోజు ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీని నమ్ముతున్నారు. మోడీ గత 10 సంవత్సరాలలో మహిళలకు సాధికారత కల్పించారు, రైతులను బలోపేతం చేసి, యువత విశ్వాసాన్ని పొందారని సీఎం సైనీ అన్నారు.

అయితే, కొంతమంది కాంగ్రెస్, జననాయక్ జనతా పార్టీ (జెజెపీ) నాయకులు బీజేపీతో టచ్‌లో ఉన్నారని మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొనడంతో ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోగలదనే నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తుంది. లోక్‌సభ ఎన్నికల వేళ సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ అనే స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Next Story