6G సిగ్నల్ టెస్టింగ్ సక్సెస్.. ఇది చాలా ఫాస్ట్ గురూ..

by Disha Web Desk 20 |
6G సిగ్నల్ టెస్టింగ్ సక్సెస్.. ఇది చాలా ఫాస్ట్ గురూ..
X

దిశ, ఫీచర్స్ : కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంది. అలాగే స్మార్ట్ ఫోన్ వినియోగం కూడా ఇంతకింతకు పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ సాయంతో ఎక్కడో జరిగిన విషయాలను కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నాం. అయితే స్మార్ట్ ఫోన్ లో ఏ విషయాలైనా స్పీడ్ గా శోధించాలంటే నెట్ వర్క్ చాలా అవసరం. నిన్న మొన్నటి వరకు 4జీ గా ఉన్న నెట్ వర్క్ వినియోగదారులకు అనుగుణంగా 5G టెక్నాలజీకి మారిపోయింది. కొంతమంది వినిగయోదారులు ఈ 5జీ స్పీడ్ తో తృప్తి చెందినప్పటికీ మరికొంతమంది మాత్రం ఇంకాస్త స్పీడ్ పెరిగితే బాగుండు అనుకుంటుంటారు. ఈ క్రమంలోనే జపాన్ లో ఉన్న కొన్ని దిగ్గజ టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జపాన్ కు చెందిన కొన్ని దిగ్గజ టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తుంది. NTT కార్పొరేషన్లు, NEC, DOCOMO, ఫుజిట్సు వంటి కొన్ని టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాన్ని తయారు చేసింది. దీంతో ప్రపంచంలోనే మొదటి 6జీ ప్రోటోటైప్ ని కనిపెట్టిన దేశంగా జపాన్ పేరు తెచ్చుకుంది. అంతేకాదు ఏప్రిల్ 11న చేసిన 6జీ టెస్టింగ్ విజయవంతం అయ్యింది. అయితే ఈ 6జీ ఇంటర్ నెట్ స్పీడ్ 5జీ స్పీడ్ కంటే కూడా 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇకపోతే ఫారన్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో వాడుతున్న 5జీ నెట్ వర్క్ ని భారత్ లో మాత్రం ఇటీవలి కాలం నుంచే వాడటం మొదలు పెట్టారు. ప్రస్తుతం జపాన్ నో అందుబాటులో ఉన్న 6జీ నెట్ వర్క్ లో 10 Gbps స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తోందని చెబుతున్నారు. కానీ రియల్ టైంలో మాత్రం 200 నుంచి 400 Mbps మధ్యనే ఉందంటున్నారు.

Next Story