క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. ఇవాళ అయినా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేస్తారా..?

by Kavitha |
క్లీంకార ఫస్ట్ బర్త్ డే.. ఇవాళ అయినా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేస్తారా..?
X

దిశ, సినిమా: రామ్ చరణ్- ఉపాసనల గారాల పట్టీ క్లీంకార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బాపు బొమ్మ పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలు జరుగుతున్న తరుణంలో లక్కీ మహాలక్ష్మీ పుట్టిందని ఫుల్ హ్యాపినెస్‌లో ఉన్నారు. ఈమె పుట్టినప్పటినుంచి వైరల్ అవుతునే ఉంది. కానీ ఇప్పటివరకు క్లీంకార ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. ఉపాసన లేదా రామ్ చరణ్ , మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎత్తుకున్నప్పటికీ ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మెగా ప్రిన్సెస్ ఫేస్ చూపించండి అంటూ అడుగుతున్నారు. అసలు క్లీంకార ఫేస్ ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని ఆత్రుతగా చూస్తున్నారు.

ఇదిలా ఉంటే నేడు(జూన్ 20) క్లీంకార మొదటి పుట్టిన రోజు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. మెగా ఫ్యామిలీలో గ్రాండ్‌గా సంబరాలు జరుపనున్నట్లు తెలుస్తుంది. ఆల్రేడి ఉపాసన క్లీంకార గురించి ఓ ఎమోషనల్ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో క్లీంకార ఫేస్ ఇవాళ అయిన రివీల్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇవాళ మెగా లిటిల్ ప్రిన్సేస్ ఫస్ట్ బర్త్ డేని ఏ రేంజ్‌లో చేస్తారో? క్లీంకార ఫేస్ రివీల్ చేస్తారో లేదో చూడాలి మరి.




Advertisement

Next Story