Kiran Abbavaram :ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోన్న ‘క’ చిత్రం నుంచి మాస్ జాతర సాంగ్ రిలీజ్

by Anjali |
Kiran Abbavaram :ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోన్న ‘క’ చిత్రం నుంచి మాస్ జాతర సాంగ్  రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘క’ సినిమా నుంచి తాజాగా మరో మాస్ సాంగ్ విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీని సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.పీరియాడిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో నయన్ సారిక కథానాయికగా నటించగా.. తన్వి రామ్ హీరోగా నటిస్తున్నారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం చిత్రం నుంచి మాస్ జాతర పాట విడుదల చేశారు మేకర్స్. దీన్ని చూస్తుంటే గ్రామంలో జాతర జరుపుకోవడం కోసం సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క మూవీలో ఓ సన్నివేశంలో వచ్చే ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆడు ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై ఆడు అనే నేపథ్యంలో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. దీనికి సనాపాటి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా.. సామ్ సీఎస్ సంగీత దర్శకత్వంలో దివాకర్, అభిషేక్ ఏఆర్, సామ్ సీఎస్ పాట పాడాలు. విజయ్ కొరియోగ్రఫీగా చేసిన ఈ పాటకు కిరణ్ అబ్బవరం మాస్ స్టెప్పులేసి నెటిజన్లను మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక క చిత్రం తెలుగు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. విడుదల తేదీని త్వరలో ప్రకటించి.. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. ఇకపోతే ప్రస్తుతం విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story