సింగర్‌తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న Khushi Kapoor.. ఒంటరిగా ఉండలేకపోతుందట

by sudharani |   ( Updated:2023-06-26 12:21:38.0  )
సింగర్‌తో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్న Khushi Kapoor.. ఒంటరిగా ఉండలేకపోతుందట
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్ ఖుషీ కపూర్ ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు కొంతకాలంగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ధిల్లాన్ రిలీజ్ చేసిన కొత్త పాటల సాహిత్యం, అతని సింగింగ్‌పై ప్రశంసలు కురిపించిన తీరు అభిమానుల దృష్టిలో పడటంతో ఇద్దరి మధ్య డేటింగ్ పుకార్లకు దారితీసింది. దీంతో వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్‌గా కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటున్నారు ఫ్యాన్స్. అలాగే త్వరలోనే రెడ్ హ్యాండెడ్‌గా ఎక్కడో ఒకచోట కెమెరాల కంటికి చిక్కుతారంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story