మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్.. అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-03-19 10:36:51.0  )
మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ రాంగ్ ఛాయిస్.. అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయి నటించారనే చెప్పాలి. తన అందంతో సావిత్రిని మలిచి అద్భుతమైన నటనను కనబరిచింది. ఇందుకు గాను కీర్తి సురేష్ కు ఏకంగా ఉత్తమ జాతీయ నటి అవార్డును కూడా దక్కింది. అలాంటిది తాజాగా ఈ మూవీ పై కీర్తి సురేష్ పై నటుడు అవసరాల శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఏం అన్నాడు అంటే.. ‘నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘మహానటి’ సినిమాలో నేను ఎల్బీ శ్రీరామ్ పాత్రలో నటించాను. అశ్విన్ అడగడంతో కాదనలేక వెంటనే ఈ పాత్రకు సరే అన్నాను. అయితే మరి సావిత్రి గారి పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడగగా కీర్తి సురేష్ పేరు చెప్పారు. కీర్తి పేరు చెప్పగానే నేను ఈ సినిమాకు రాంగ్ ఛాయిస్ అని అనుకున్నాను. కీర్తి సురేష్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తారు. అలాంటిది సావిత్రి గారి పాత్రలో నటించగలరా ఆమెలా హావభావాలు పలికించగలద అనుకున్నన్నాను. కానీ ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో నేను తప్పుగా ఆలోచించాను అనిపించింది. కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రకు ఫర్ ఫెక్ట్ ఛాయిస్ అని అర్థమైంది’ అని తెలిపాడు. ప్రజంట్ ఆయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More..

పెళ్లై రెండేళ్లైనా నయనతారకు ఆ కోరిక తీరలేదా? అయ్యో పాపం అంటున్న నెటిజన్లు

Advertisement

Next Story