Keerthy Suresh ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2023-07-08 13:13:58.0  )
Keerthy Suresh ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?.. షాక్ అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటి కీర్తి సురేష్.. తన తొలి సినిమాకు ఎంత తీసుకుందో తెలిస్తే షాక్‌ అవుతారు. ‘నేను శైల‌జ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కు ప‌రిచ‌య‌మైన ఆమె.. ‘మ‌హాన‌టి’తో భారీ పాపులారిటీ దక్కించుకుంది. అయితే కీర్తి చిన్నప్పటి నుంచే సినిమాలు చేసిందట. బాలనటిగా మలయాళంలో మూడు సినిమాలు చేసిన ఆమె.. తొలి పారితోషికం రూ. 500 తీసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్‌ తండ్రి సురేష్ కుమార్‌ వెల్లడించాడు. తండ్రి ప్రొడ్యూసర్‌, తల్లి నటి కావడం వల్ల ఆమె సినీ పరిశ్రమలోకి రావడం చాలా తేలికైంది. కాగా కీర్తి తొలిసారి 2000లో తన తండ్రి నిర్మించిన ‘పైలట్స్‌’ అనే సినిమా ద్వారా కెమెరా ముందుకు రాగా.. ఈ చిత్రంలో నటించినందుకుగానూ కూతురికి రూ.500 ఇచ్చాడట. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి 3 కోట్లు తీసుకుంటుండగా ఓల్డ్ రెమ్యూనరేషన్ న్యూస్ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story