అతనికి తప్పా.. ఇంకెవరికీ లిప్ కిస్ ఇవ్వను: Keerthy Suresh

by sudharani |   ( Updated:2023-06-21 10:56:18.0  )
అతనికి తప్పా.. ఇంకెవరికీ లిప్ కిస్ ఇవ్వను: Keerthy Suresh
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే వరుస చిత్రాల్లో నటించి, తన నటనతో నేషనల్ అవార్డు కూడా కైవసం చేసుకుంది. ఇక ఎంత ఫేమ్ ఉన్నప్పటికీ కొంత మంచి స్టార్ హీరోయిన్‌లు హద్దులు మాత్రం దాటరు. ఎన్ని కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చిన తాను నియమించుకున్న కొన్ని నిబంధనలు మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతుంటారు. ఇందులో కీర్తి కూడా ఒకరు.

తన సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో ఆమె నటించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకుందట. ఇది విన్న నెటిజన్లు ఆమెపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో తమన్నా కూడా అలాగే చెప్పింది. కానీ బాలీవుడ్ వెళ్లి బెడ్ రూమ్ అడల్ట్ రొమాంటిక్ సన్నివేశాలో నటిస్తుంది. మీరు కూడా అలాంటి ట్విస్ట్ ఇవ్వకుంటే చాలు’ అని అంటున్నారు. అయితే ముద్దు గుమ్మ ఇప్పటికే ఒకటి ఫిక్స్ అయి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందట. ‘నా మొదటి లిప్ లాక్ కేవలం నా భర్తతో మాత్రమే. నా సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలకు తావు లేదు. నా తల్లిదండ్రులకు మాట ఇచ్చాను’ అని నటి తెలిపింది.

Read more : ఆ లక్షణాలున్నవాడినే పెళ్లాడతా.. ముఖ్యంగా ఆ అలవాటు ఉండాలి

Advertisement

Next Story

Most Viewed