Keerthy Suresh :ఫ్యామిలీతో కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్స్..క్రేజీ ఫొటోలు వైరల్!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-16 15:40:16.0  )
Keerthy Suresh :ఫ్యామిలీతో కీర్తి సురేష్ ఓనమ్ సెలబ్రేషన్స్..క్రేజీ ఫొటోలు వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. నేను శైలజ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మహనటి మూవీతో స్టార్ హీరోయిన్‌గా మారడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ అందాల ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక అన్ని మూవీలకు ఓకే చేసి నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే కీర్తి సురేష్ ప్రజెంట్ దుబాయ్‌లో ఓనమ్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

సైమా 2024 అవార్డ్స్​ కోసం కీర్తి సురేష్ దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ అవార్డులు అందుకున్న అనంతరం ఓనమ్ సెలబ్రేషన్స్​లో పాల్గొంది. ఈ బ్యూటీ వైట్ శారీలో సింపుల్​గా ముస్తాబై తన అందంతో ఆకట్టుకుంటోంది. సింపుల్​గా హెవీ మేకప్ జ్యువెలరీ లేకుండా ఓనమ్​ లుక్​లో కీర్తి సింపుల్​గా, ఎలిగెంట్​గా కనిపించింది. పిల్లాడిని ఎత్తుకుని అతనిని ముద్దు చేస్తున్న ఫొటోలో కీర్తి ఎంతో అందంగా కనిపిస్తుంది. బంచ్ ఆఫ్ పీపుల్స్​తో ఉన్న ఫొటోల్లో కీర్తి క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ సందర్భంగా ఓనమ్ స్పెషల్ రాక్షసుడిగా రెడీ అయిన వ్యక్తితో ఫొటోలు దిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజీ ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చేయగా నెట్టింట వైరల్‌గా మారాయి.




Advertisement

Next Story