Keerthy Suresh: సమంత సినిమా రీమేక్‌లో యంగ్ హీరోయిన్.. ఏమాత్రం భయం లేదంటూ కామెంట్

by sudharani |
Keerthy Suresh: సమంత సినిమా రీమేక్‌లో యంగ్ హీరోయిన్.. ఏమాత్రం భయం లేదంటూ కామెంట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకుని ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది కీర్తి సురేష్. తాజాగా ‘రఘుతాత’ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ‘బేబీ జాన్’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం.. సమంత, విజయ్ కాంబోలో వచ్చిన ‘తెరీ’ రీమేక్‌గా ఈ చిత్రం రాబోతుంది. కాలీస్‌ దర్శకత్వంలో రానున్న ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 24న విడుదల కానుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ కీర్తి.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘సాధారణంగా రీమేక్ సినిమాల్లో నటించాలంటే కష్టమైన పని. అందుకే అలాంటి చిత్రాలు చెయ్యాలంటే నేను భయపడతాను. కానీ ‘బేబీ జాన్’లో నటించడానికి నేను భయపడలేదు. ఎందుకంటే.. ‘తేరీ’లో సమంత క్యారెక్టర్ చాలా చక్కగా చూపించారు. అందుకే ఈ సినిమా చెయ్యడం నాకు చాలా నచ్చింది. అలాగే హీరోయిన్ పాత్రను చాలా అద్భుతంగా రాశారు. స్క్రీన్‌పై చక్కగా చూపించనున్నారు. కథ పరంగా చిత్ర బృందం ఎలాంటి మార్పులు చేయలేదు. ‘తేరీ’ విడుదలైన ఎనిమిదేళ్ల తర్వాత ‘బేబీజాన్‌’ తెరకెక్కుతోంది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న మార్పులు చేశారు. హిందీ మార్కెట్‌కు కావాల్సిన విధంగా ‘బేబీజాన్‌’ను సిద్థం చేయనున్నారు. నా పాత్ర అందరికీ చేరువవుతోంది. ఈ సినిమాపై నాకెన్నో ఆశలున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story