ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్న మహానటి.. వీడియో వైరల్

by samatah |   ( Updated:2023-03-24 12:07:30.0  )
ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతున్న మహానటి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మంచి కథలను ఎంచుకుంటూ మహానటి‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. కాకపోతే కెరీర్ ప్రారంభంలో ఉన్నట్లు ఆమె ఇప్పుడు లేదు. డ్రెస్సింగ్‌లో, అటిట్యూడ్‌లోనే గాక అలవాట్లలో కూడా ఆమెలో బాగానే మార్పు కనిపిస్తోంది. ఇక ఈమె టిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. డీ గ్లామరస్‌గా కీర్తి సురేష్ చాలా సహజమైన రోల్‌లో నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో మార్చి 30న రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ గ్యాప్ లేకుండా ప్రమోషన్ చేస్తోంది. ఇందులో భాగంగా దసరా సెట్స్‌లో రానా దగ్గుబాటి, నాని, కీర్తి‌లతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నాని, రానా కలిసి చిన్న లిక్కర్ బాటిల్‌ను నోట్లో పెట్టుకొని, ఎత్తిన సీసా దించకుండా మొత్తం బాటిల్ ఖాళీ చేశారు. వెంటనే కీర్తి సురేష్ కూడా ఓ బాటిల్ అందుకొని, ఆమె కూడా ఎత్తిన సీసా దించకుండా తాగి చూపించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More: మాకు అదే ముఖ్యం.. సిద్ధార్థ్‏తో డేటింగ్‌పై స్పందించిన అదితి

Advertisement

Next Story