- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి.. రష్మిక వీడియోపై కవిత ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా హీరోయిన్ రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ రష్మికకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా, కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి ఓ ట్వీట్ చేసింది. ‘‘రష్మిక మందన్న ఫేక్ మార్ఫింగ్ వీడియో సైబర్ ముప్పు గురించి మహిళలకు ఒక హెచ్చరిక లాంటిది.
మహిళలను సైబర్ ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దీని పై తగిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి” అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. దీనిపై రష్మిక కూడా స్పందించి ఓ ఎమోషనల్ నోట్ తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్‌కు సంబంధించిన వీడియో అని తెలుస్తోంది. ఆమె బాడికి రష్మిక ఫేస్‌ను పెట్టి సోషల్ మీడియాలో కొందరు ట్రెండ్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై రష్మిక ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.