'బెదురు లంక 2012' నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్

by Hajipasha |   ( Updated:2023-10-12 07:17:06.0  )
బెదురు లంక 2012 నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు కార్తికేయ హీరో, విలన్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'బెదురు లంక 2012'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. నేహా శెట్టి హీరోయిన్‌గా కనిపించనుండగా అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనిత నాథ్, దివ్య నార్ని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సరికొత్త నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. క్లాక్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తికేయ సరికొత్తగా కనిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

Advertisement

Next Story