ప్లీజ్ మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. నేహతో రొమాన్స్‌పై స్పందించిన హీరో

by Hamsa |   ( Updated:2023-08-14 09:40:03.0  )
ప్లీజ్ మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. నేహతో రొమాన్స్‌పై స్పందించిన హీరో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తనపై వచ్చిన ఓ తప్పుడు వార్తపై ఘాటుగా స్పందించాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’ ఆగస్టు 25న విడుదలకానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తనకు ‘డిజే టిల్లు’తో నేహాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చిందని, అందుకే తామిద్దరికీ జోడి కుదిరిందన్నాడు. అలాగే ఇందులోనూ అలాంటి ఓ సీన్ ఉన్నప్పటికీ ఇతర చిత్రాలతో దీనికి పోలికలేదన్నాడు. అయితే ఓ వెబ్‌సైట్ ఆయని చెప్పని మాట‌ల‌ను త‌ప్పుడు థంబ్‌నెల్స్‌తో సోష‌ల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశమవగా వెంటనే రియాక్ట్ అయిన హీరో ‘ప్లీజ్ నా ఇంటర్వ్యూ సరిగ్గా చూసి తదనుగుణంగా పోస్ట్ చేయండి. ఇది నేను చెప్పలేదు. దయచేసి నటీనటుల ఇమేజ్‌కి లేదా సినిమాకి హాని కలిగించే వాటిని పోస్ట్ చేయొద్దు. ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Read More: Keerthi Pandian : పెళ్లి చేసుకోబోతున్న మరో సెలబ్రిటీ జంట!

Advertisement

Next Story