'పొన్నియిన్ సెల్వన్'ను ఆ సినిమాతో పోల్చొద్దు.. కార్తీ

by sudharani |
పొన్నియిన్ సెల్వన్ను ఆ సినిమాతో పోల్చొద్దు.. కార్తీ
X

దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో కార్తీ 'పొన్నియిన్ సెల్వన్'లో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌‌కు హాజరైన హీరో.. తెలుగు ప్రేక్షకులతో తనకున్న అనుబంధం గురించి గొప్పగా చెప్పాడు. అలాగే మ‌ణిర‌త్నం 40 ఏళ్ల క‌ల 'పొన్నియిన్ సెల్వన్'.. 'బాహుబ‌లి'లా ఉంటుందా? అని కొంతమంది అడుగుతున్నారన్న ఆయన.. ఇది 'బాహుబ‌లి'లా ఉండ‌దు. ఎందుకంటే మనం ఇప్పటికే ఆ సినిమా చూసేశాం. కాబట్టి దీన్ని 'బాహుబలి'తో పోల్చాల్సిన అవసరం లేదు. 70 ఏళ్లుగా న‌వ‌లా రూపంలో ఉన్న క‌థ‌ను మ‌ణిర‌త్నం సినిమాగా తీశారు' అని స్పష్టం చేశాడు.

Advertisement

Next Story