కర్మ వాళ్లకు తగిన శిక్ష వేస్తుందంటూ.. శృతి హాసన్ షాకింగ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-08-18 09:42:14.0  )
కర్మ వాళ్లకు తగిన శిక్ష వేస్తుందంటూ.. శృతి హాసన్ షాకింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శతి హాసన్ ఇటీవల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ఒకేసారి రెండు సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. అదే ఫామ్‌తో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ మూవీతో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా, శృతి హాసన్ తన ఇన్‌స్టా స్టోరీలో షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ నేను కొందరిని గమనిస్తుంటాను. వారు గోతులు తీస్తారు. కానీ వాళ్లే అందులో పడిపోతుంటారు. అందుకే నేను అలాంటి వారిని చూసినా సైలెంట్‌గా నా పని నేను చూసుకుంటాను. కర్మ వాళ్లకు తగినట్లుగా శిక్షిస్తుంది’’ అని రాసుకొచ్చింది. దీంతో అది చూసిన వారు ఈ అమ్మడుని ఎవరో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారా? అందుకే వారికి కౌంటర్లు వేసిందని అనుకుంటున్నారు.



Advertisement

Next Story

Most Viewed