Kareena Kapoor Khan: సైఫ్‌తో పెళ్లి.. వారు హెచ్చరించారంటూ కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-09-22 14:52:03.0  )
Kareena Kapoor Khan: సైఫ్‌తో పెళ్లి.. వారు హెచ్చరించారంటూ కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పెళ్లై పిల్లలున్నా వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీకి షేక్ చేస్తోంది. అంతేకాకుండా పారితోషికంతో సంబంధం లేకుండా కథకు ప్రాధాన్యతనిస్తుంది. తాజాగా, ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను మంచి స్థాయిలో ఉన్న టైమ్‌లో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు కొందరు నన్ను హెచ్చరించారు. వివాహం చేసుకుంటే కెరీర్ ముగిసిపోతుందని అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు.

ఎలా జరగాలని రాసిపెడితే అలా అవుతుందని వారికి సమాధానమిచ్చాను. కానీ పెళ్లి తర్వాతే వర్క్ లైఫ్‌పై ఆసక్తి పెరిగింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. నిన్ను నువ్వు నమ్ముకుని సవాళ్లకు స్వీకరించి ముందుకు సాగడంలోనే ఏదైనా ఉంటుంది’’ అని చెప్పింది. కాగా కరీనా సినిమాల విషయానికొస్తే.. క్రూతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ మూవీతో ప్రేక్షకులను మెప్పించింది.

Advertisement

Next Story

Most Viewed