- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కెరీర్ మొత్తం ఆ పేరు కోసమే ఆరాటపడ్డాను: కరీనా
దిశ, సినిమా: రెండు దశాబ్దాల క్రితమే తాను డ్యాన్సింగ్ స్టార్‌గా కాకుండా పవర్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నట్లు కరీనా కపూర్ వెల్లడించింది. తాజాగా ఓ సమావేశంలో కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న ఆమె.. 2000లో వచ్చిన 'రెఫ్యూజీ'లో అభిషేక్‌తో అరంగేట్రం చేయడానికి ముందు తన కెరీర్ గురించి గొప్పగా ఊహించుకున్నట్లు తెలిపింది. 'నా మొదటి చిత్రంలోనే నటిగా నిరూపించుకోవడానికి సహాయపడే పాత్ర లభించింది. ఇది పూర్తిగా భిన్నమైనది. ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు, మంచి బట్టలు ధరించవచ్చు. ఇది పెద్ద విషయం కాదు. అలాంటివి నేను కోరుకోవడం లేదు. ఎప్పుడూ పవర్‌ఫుల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకోవాలని ఆరాటపడ్డాను' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత వసూళ్లు రాబట్టకపోవడంతో తన నెక్ట్స్ మూవీకి విరామం కూడా బాగానే దొరికిందంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Rumours పై స్పందించిన Anchor Suma