ఈ సౌత్ హీరో గర్ల్ ఫ్రెండ్‌గా మారాలనుకుంటున్న కరీనా కపూర్.. ఇప్పుడైనా రెడీ అంటూ..

by sudharani |   ( Updated:2023-11-17 14:13:04.0  )
ఈ సౌత్ హీరో గర్ల్ ఫ్రెండ్‌గా మారాలనుకుంటున్న కరీనా కపూర్.. ఇప్పుడైనా రెడీ అంటూ..
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కాంట్రవర్షియల్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో సౌత్ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రాపిడ్ ఫైర్ రౌండ్‌లో ‘ఏ సౌత్ హీరోతో జతకట్టాలని అనుకుంటున్నావు?’ అని ప్రశ్నించాడు హోస్ట్ కరణ్ జోహార్. ‘ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యష్ పేర్లలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు’ అని అడిగాడు. దీంతో వెంటనే రియాక్ట్ అయిన కరీన.. యష్‌ అని చెప్పేసింది. తనకు తాను ‘కేజీఎఫ్ గర్ల్’‌గా గర్వంగా ప్రకటించుకుంది.

దీంతో యష్ అభిమానులు ఈ క్లిపింగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఆయన స్టార్‌డమ్ లోకల్ టు ఇంటర్నేషనల్ అందరినీ ఫిదా చేసిందని మురిసిపోతున్నారు. ఈ క్రమంలో యష్ గురించి రవితేజ, అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ‘కేజీఎఫ్’ లేకపోతే యష్‌కు ఇంత స్టార్‌డమ్ లేదని.. ఇదంతా లక్ అన్నట్లుగా చేసిన కామెంట్స్‌ను.. కరీన ‘కేజీఎఫ్ గర్ల్‌’గా ప్రకటించుకోవడంతో పోలుస్తున్నారు.

Advertisement

Next Story