- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gaddarపై Karate Kalyani వివాదాస్పద పోస్టు.. ఎర్ర బ్యాచ్ అంటూ హేళన
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా యుద్ద నౌక గద్దర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన ఆటపాటలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సోమవారం నిర్వహించింది. ఆయన అంత్యక్రియలకు అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.
తాజాగా, సీని నటి బిగ్‌బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గద్దర్‌పై వివాదాస్పద పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ఎర్ర పాట.. మూగబోయింది. కన్నీటి వీడ్కోలు ఓం శాంతి. బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు. మర్చిపోలేదు కానీ పోయి నోల్లని తిట్టే సంస్కారం మా ధర్మంలో లేదు’’ అంటూ తన ఫేస్ బుక్‌లో వరుస పోస్టులు పెట్టింది. దీంతో అది చూసిన ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. పోయి నోళ్లని తిట్టడానికి నీకు మనసెలా వచ్చింది? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. కానీ, కరాటే కళ్యాణి మాత్రం ఫేస్ బుక్ లైవ్ పెట్టి పోస్ట్ తీయకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి నా పోస్టులు నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరించింది.
Read More: ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ దర్శకురాలికి షాక్.. రూ. 2 కోట్ల లీగల్ నోటీసు