చందు వాట్స్ అప్ చాట్ బయటపెట్టిన కరాటే కళ్యాణి!.. ధైర్యం చెప్పడానికి చాలా ట్రై చేశాను

by Kavitha |
చందు వాట్స్ అప్ చాట్ బయటపెట్టిన కరాటే కళ్యాణి!..  ధైర్యం చెప్పడానికి చాలా ట్రై చేశాను
X

దిశ, సినిమా: 'త్రినయిని' సీరియల్‌లో నటించిన చందు మన అందరికి సుపరిచితమే. ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో కూడా నటిస్తున్నారు. కాగా 2015లో శిల్ప అనే ఆమెను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు నిన్న హైదరాబాద్ లోని త్రినయని నటి పవిత్ర ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పవిత్ర చందు గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఆమె మరణాన్ని తట్టుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి చందు వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది రాత్రి పదకొండు గంటలకు చందు నుంచి కరాటే కల్యాణికి మెసేజ్ వచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే పిచ్చోన్ని అయిపోతాను. మందుకు అలవాటుపడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఇంక చాలు ఈ జన్మ. నా ఆత్మహత్య విషయం ఎవరికీ చెప్పకండి అని మెసేజ్ చేసాడు. కరాటే కళ్యాణి మేమంతా నీకు ఉన్నాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం పాపం. యాదవ్ అంటేనే ధైర్యం పవిత్ర పిల్లలు కూడా నీతో ఉన్నారు అని చందు కి ధైర్యం చెప్పడానికి చాలా ట్రై చేసింది. వాయిస్ కాల్ లో కూడా ఇద్దరు మాట్లాడారు.

కాగా చందు, కరాటే కళ్యాణి లు కలిసి కొన్ని సీరియల్స్ లో నటించారు. ఇద్దరి మధ్య అక్క తమ్ముడి అనుబంధం ఉంది.

Advertisement

Next Story

Most Viewed