ఇది కదా హీరోలు చేయాల్సిన పని.. ‘కాంతారా’ నటుడు చేసిన పనికి అంతా హ్యాపీ!

by GSrikanth |
ఇది కదా హీరోలు చేయాల్సిన పని.. ‘కాంతారా’ నటుడు చేసిన పనికి అంతా హ్యాపీ!
X

దిశ, వెబ్‌డెస్క్: కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ.400 లకు పైగా కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తాజాగా.. రిషబ్ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తన స్వగ్రామమైన కెరడిలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. తన ‘రిషబ్ శెట్టి ఫౌండేషన్’ తర్వాత ఆ స్కూలుకు సాయం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. ఇది కదా హీరోలు చేయాల్సిన పని అంటూ అభినందిస్తున్నారు.

Advertisement

Next Story