- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Twitter Account నిబంధనలు ఉల్లంఘించిన నటుడికి బిగ్ షాక్!
దిశ, సినిమా: నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ నటుడు కిషోర్ కుమార్ జి ఖాతాను సస్పెండ్ చేసింది ట్విట్టర్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ముక్కు సూటిగా మాట్లాడే నటుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 43,000, ఫేస్‌బుక్‌లో 66,000 మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. కాగా ఇటీవల న్యూస్ బ్రాడ్‌కాస్టర్ NDTVని అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడంపై స్పందించిన కుమార్.. 'స్వేచ్ఛగా ఉండాల్సిన మీడియా, భారత ప్రజాస్వామ్యానికి ఇది 'బ్లాక్ డే'' అంటూ డిసెంబర్ 30న ఓ ట్వీట్ చేశాడు.
అలాగే జనవరి 1న మరొక పోస్ట్‌లో 'బ్లడీ డెత్' అంటూ 'కాంతారా' దేవుడిని అవమానించిన ఓ నెటిజన్ వీడియో గురించి మాట్లాడుతూ.. 'అది దేవుడు లేదా రాక్షసుడైనా మనం దానిని కేవలం నమ్మకంగా ఎందుకు చూడలేము. అది ఉందని మీరు విశ్వసిస్తే ఉన్నట్లు. లేదనుకుంటే లేదు. కానీ, కష్ట సమయాల్లో మనలో చాలా మందికి ధైర్యాన్నిచ్చే నమ్మకాలను అవమానించాల్సిన అవసరం లేదు. సంఘ వ్యతిరేక అంశాలను చట్టం చూసుకుంటుంది. విశ్వాసం వ్యక్తిగత ఎంపికగా ఉండనివ్వండి' అని కౌంటర్‌గా ట్వీట్ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని కిషోర్ స్వయంగా ప్రకటించకపోగా ఒక వినియోగదారు నటుడి హ్యాండిల్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు సస్పెండ్ చేసినట్లు గుర్తించడంతో ఈ ఇష్యూ బయటపడింది.
ఇవి కూడా చదవండి : డిజిటల్ ప్రీమియర్‌గా 'హిట్ 2' .. సినిమా చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే..