‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది.. శివుడు పాత్రలో ఆ హీరో.. ప్రభాస్ లుక్స్ హైలెట్

by Javid Pasha |   ( Updated:2024-06-14 13:24:19.0  )
‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది.. శివుడు పాత్రలో ఆ హీరో.. ప్రభాస్ లుక్స్ హైలెట్
X

దిశ, సినిమా : హీరో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నన్న విషయం తెలిసిందే. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా (జూన్ 14) టీజర్ కూడా రిలీజ్ చేశారు.

నిమిషానికి పైగా ఉన్న ఈ టీజర్ ఆసక్తి రేపుతుండగా, ఇందులో ప్రభాస్ లుక్ కూడా హైలెట్‌గా నిలిచింది. యాక్షన్ ఎపిసోడ్స్, లొకేషన్స్, గెటప్స్ అదుర్స్. గుర్రపు స్వారీలు, విలంబులతో యుద్ధాలు శరా మామూలే. అయితే ఇందులో మంచు విష్ణు పాత్ర పేరు ‘తిన్నడు’ కావడం విశేషం. అయితే ఇందులో ‘శివుడి’ పాత్రలో ప్రభాస్ నటిస్తాడని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం విడుదలైన టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ శివుడిగా నటించినట్లు తెలుస్తున్నది. అట్లనే టీజర్‌లో ప్రభాస్ కళ్లని మాత్రమే చూపిస్తూ ఓ షాట్ వేయగా, కన్నప్పని ఓ యుద్ధ వీరుడిగా చూపిస్తున్న సన్నివేశాలను హైలెట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

Advertisement

Next Story