- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రహ్మాస్త్ర కలెక్షన్లపై కంగనా సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి తెలిసిందే. ఎప్పుడు సందర్భం వచ్చినా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌ని విమర్శించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఆమె విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విడుదలైన రోజే ఈ సినిమా ఫ్లాప్ అవుందని చెప్పిన కంగనా.. ఖచ్చితంగా రూ. 800 కోట్ల నష్టాన్ని మిగిలిస్తుందని అంచనా వేసింది. దీంతో ఈ సినిమాకు అనవసరంగా అన్ని కోట్లు వేస్ట్ చేసారంటూ చెప్పుకోచ్చింది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఆ సినిమా రూ. 144 కోట్ల నెట్, రూ. 246 కోట్ల గ్రాస్ రాబట్టిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన కంగనా.. మరో సారి బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లపై ధ్వజమెత్తింది. ఈ కలెక్షన్‌లను షేర్ చేస్తూ.. ''ఇది కేవలం రూ. 144 కోట్లు (నెట్) మాత్రమే కలెక్ట్ చేస్తే, తమ సినిమా పెద్ద హిట్ అని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. సినిమా మాఫియా ఏ విధంగా పని చేస్తుందో ఇక్కడే తెలిసిపోతుంది. అయినా.. కలెక్షన్లు లేదా రికవరీలతో ఏమాత్రం సంబంధం లేదు. వారికి నచ్చిన వాళ్లను హైప్ చేస్తారు, నచ్చని వాళ్లను బహిష్కరిస్తారు. ఇప్పుడు వాళ్ల అసలు రంగు బయటపడింది'' అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌ల్ చేస్తున్నాయి.
Also Read : 'సీతారామం' హీరోయిన్ ఫుల్ ఖుష్.. ఎందుకో తెలుసా?