నీకు ఎలా రాసిపెట్టివుంటే అలాగే జరుగుతుంది: సల్మాన్ కామెంట్స్‌పై కంగన

by Prasanna |   ( Updated:2023-05-01 09:29:20.0  )
నీకు ఎలా రాసిపెట్టివుంటే అలాగే జరుగుతుంది: సల్మాన్ కామెంట్స్‌పై కంగన
X

దిశ, సినిమా : హత్య బెదిరింపులకు సంబంధించి ‘భారత్‌లో కొంత సమస్య ఉంది’ అనే సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కంగనా రనౌత్ స్పందించింది. రీసెంట్‌గా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మన దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, భద్రత గురించి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని చెప్పింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నుంచి సల్మాన్ రక్షణ పొందుతున్నాడన్న కంగన.. ఎవరికైనా సరే ప్రాణహానీ బెదిరింపులు వచ్చినపుడు ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే మనకు ఏమి జరగాలని రాసివుంటే అదే జరుగుతుందన్న నటి.. వాటన్నింటికీ దేవుడు ఉన్నాడనే నమ్మకంతోనే తాను స్వేచ్ఛగా తిరగుతున్నట్లు వెల్లడించింది. ‘చాలా శక్తులు నా చుట్టూ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నాయి. ఈ రోజుల్లో నాకు భయంగానే ఉంది’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

Read More:

Mrunal Thakur: పెళ్లి కూతురుగా ముస్తాబైన మృణాల్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

షాపింగ్ మాల్‌లో ఈషా నిపుల్ షో.. బ్రా కొనిస్తామంటున్న కుర్రాళ్లు

Advertisement

Next Story