నేను గాయపరిచిన స్నేహితులందరికీ క్షమాపణలు.. కంగనా పశ్చాత్తాపం

by Mahesh |   ( Updated:2022-10-25 09:27:22.0  )
నేను గాయపరిచిన స్నేహితులందరికీ క్షమాపణలు.. కంగనా పశ్చాత్తాపం
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు చేసిన నటి.. క్రాకర్స్ కాలుస్తూనే డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసిన నటి.. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ఎల్లప్పుడూ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, సహనటులను పలు సందర్భాల్లో నానా మాటలతో తిట్టిపోసే కంగనా.. ఈ పవిత్రమైన దివాళీ రోజున తన మాటలతో గాయపరిచిన బాలీవుడ్ స్నేహితులందరినీ క్షమాపణలు కోరింది. 'ఈ సంవత్సరం ముగుస్తున్నందున నేను నా బాలీవుడ్ స్నేహితుల మాదిరిగానే ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ఏడాది నేను బాధించిన ఎవరైనా దానికి అర్హులు' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇవికూడా చదవండి: ఎన్నాళ్లయిందో నిన్ను ఇలా చూసి.. అనుష్క అందానికి ఫ్యాన్స్ ఫిదా

Advertisement

Next Story

Most Viewed