స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగన.. పేరు గుర్తులేదంటూ

by samatah |
స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగన.. పేరు గుర్తులేదంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ వ్యక్తిత్వంపై నటి కంగనా రనౌత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ ఇండియన్ నవలిస్ట్, రచయిత శోభా డే రచించిన పుస్తకాన్ని తాజాగా అమీర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఓ విలేకరి 'శోభా డే బయోపిక్ తీస్తే ఆమె పాత్రను ఎవరు పోషిస్తే బాగుంటుంది?' అని హీరోను ప్రశ్నించాడు. దీంతో 'ప్రియాంక, దీపికా, అలియా అద్భుతంగా నటిస్తారు. శోభా డే పాత్రకు వీరి పేర్లే నాకు గుర్తుకొస్తాయి' అన్నాడు. అయితే పక్కనే ఉన్న శోభా డే వెంటనే కలుగజేసుకొని కంగన పేరు చెప్పగా.. 'ఆమె కూడా అద్భుతమైన నటే. అనేక కొత్త రకాల పాత్రలను పోషిస్తుంది' అంటూ అమీర్ పేర్కొన్నాడు. దీనిపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన కంగన.. 'మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నా పేరును ప్రస్తావించకుండా ఉండేందుకు అమీర్ చాలా ప్రయత్నించారు. నావి, శోభ‌ రాజకీయ అభిప్రాయాలు పరస్పర విరుద్ధమైనవి. అయినప్పటికీ, నా నటన, కళ, శ్రమ‌ను ఆమె ప్రశసించింది. ఇది శోభ గొప్పతనానికి అద్దం పడుతుంది. మీ కొత్త పుస్తకానికి నా శుభాకాంక్షలు' అంటూ అమీర్‌‌ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది కంగన.

Advertisement

Next Story