Prabhas ‘Project-k’ లో Kamal Hassan.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (వీడియో)

by Hamsa |   ( Updated:2023-10-10 14:47:12.0  )
Prabhas ‘Project-k’ లో Kamal Hassan.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్-కె’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితా బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రాబోతుంది. తాజాగా, చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో స్టార్ హీరో కమల్ హాసన్ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ఓ వీడియోను విడుదల చేశారు. కాగా ప్రాజెక్ట్-కె 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story