Kalyan Dev ఎమోషనల్ పోస్ట్.. శ్రీజ కోసమేనా!!

by samatah |   ( Updated:2022-12-17 03:46:57.0  )
Kalyan Dev  ఎమోషనల్ పోస్ట్.. శ్రీజ కోసమేనా!!
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా కళ్యాణ్ దేవ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమాలో నటించి ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారనే .. వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆ రూమర్స్‌పై ఇప్పటికీ మెగా కుటుంబం, కళ్యాణ్ దేవ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల మెగా డాటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీజ కళ్యాణ్ నుండి శ్రీజ కొణిదెలగా అకౌంట్ పేరు మార్చుకుంది. దీంతో వారు విడాకులు తీసుకున్నారనే రూమర్లు నిజమేనని అంతా అనుకున్నారు. తాజాగా, కళ్యాణ్ దేవ్ తన సోషల మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ''ఓపిగ్గా ఉంటే అన్నింటికి సమాధానం దొరుకుతుంది'' అంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అది చూసిన వారు ఈ పోస్ట్ శ్రీజ కోసమే పెట్టాడని అనుకుంటున్నారు.

Advertisement

Next Story