న్యూ బేబీ రాబోతుందంటూ గుడ్ న్యూస్ చెప్పిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్ !

by Anjali |   ( Updated:2023-12-22 06:12:45.0  )
న్యూ బేబీ రాబోతుందంటూ గుడ్ న్యూస్ చెప్పిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.. పోస్ట్ వైరల్ !
X

దిశ, వెబ్‌‌డెస్క్: విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్. ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాల్లో నటించాడు. ఈ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న కూమార్తె శ్రీజను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. కానీ ఇప్పటివరకు డివోర్స్ మాత్రం తీసుకోలేదు. కాగా.. సోషల్ మీడియాలోని నెటిజన్లు వీరు మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీజ-కల్యాణ్‌ నవిష్క అనే కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ పాప తల్లి వద్దే ఉంటుంది.

కానీ ఫేస్టివల్స్‌కు కల్యాణ్ దేవ్‌ తన ఇంటికి తీసుకెళ్లి తనతో సేలబ్రేట్ చేసుకుంటాడు. ఇకపోతే తాజాగా కల్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కల్యాణ్ చెల్లెలు ఐశ్వర్య సీమంతం వేడుకలో పాల్గొన్న ఫొటోలను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తన కూమార్తె నిష్క కూడా పాల్గొంది. ‘‘మీ అందరి ప్రేమ, అభిమానాలతో నా కుంటుంబం ఇంకా పెరుగుతుంది.’’ అంటూ ఫొటో కింద క్యాప్షన్ రాసుకొచ్చాడు. కల్యాణ్ దేవ్ ఈ వేడుకలో తన ఫ్యామిలీతో కలిసున్న పిక్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story

Most Viewed