కల్కి మూవీ ప్రభాస్ అన్న కోసం చేశా, నేను నాగికి లక్కీ కాదు.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |
కల్కి మూవీ ప్రభాస్ అన్న కోసం చేశా, నేను నాగికి లక్కీ కాదు.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలై హిట్ టాక్ అందుకుంటూ దూసుకుపోతోంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైనా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 380 కోట్లు రాబట్టింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో విజయ్‌ని కల్కి సినిమా గురించి మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఇక ఈ చిత్రం గురించి అడుగుతూ ఉక్కిరి బిక్కిరి చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించే ప్రతి చిత్రంలో నటిస్తున్నారు. మిమ్మల్ని నాగ్ అశ్విన్‌కి లక్కీ చామ్ అంటున్నారు అని రిపోర్టర్ అనగా విజయ్ దేవరకొండ స్పందించి.. నేను నాగికి లక్కీ కాదు. ప్రభాస్ అన్న కోసం, నాగి కోసం ఈ సినిమాలో నటించా. కల్కి అంత అద్భుతంగా ఉంది కాబట్టే విజయం సాధించింది. ఇందులో మనదేమి లేదు అంటూ విజయ్ దేవరకొండ హుందాగా బదులిచ్చాడు.

అదే విధంగా మహానటి , కల్కి చిత్రాలని నాగి అంత బాగా తెరకెక్కించాడు కాబట్టే విజయం సాధించాయి అని అన్నారు. ప్రభాస్ అన్న కోసం ఈ చిత్రంలో నటించారు. నాగి పిలిస్తే ఒకరోజు షూటింగ్‌కి వెళ్లినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. నాగి క్రియేట్ చేసిన ఒక యూనివర్స్‌లో నేను చిన్న పాత్ర చేశాను. అంతే కానీ ప్రభాస్ కర్ణుడు.. నేను అర్జునుడు లాంటి పోటీ లేదని విజయ్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed